మబ్బు చాటున జాబిలమ్మా సిగ్గుపడతావే ..
చీకటమ్మ ఒడిలోన మెరిసిపోతావే .....
అరవిచ్చిన వేలకలువలు ఎదురుచుడంగ..
శరత్కాలపు నడు నిశిలో వెల్లి విరిశావే...
ఉవ్వెత్తున ఎగసిపడే సాగర కెరటాలకు....
ఉత్తుంగ తరంగపు సరిగమలు నేర్పావే .........
తమస్సు నిండిన ఈ మనుష్యలోకాన కోటికాంతులు నింపగలవా...
జాడ్యంలో కొట్టు మిట్టాడే ఈ పాడు లోకంలో పండు వెన్నెల కురిపించగలవా ....
....కొంచెం కొంటెతనం
Web లో వెదుకు
పరిచయం
- చక్రి
- కదిలే కాలపు ఇరుసును నేను ప్రతి పయనానికి తోడును నేను, చీకటి చీల్చే వెలుగును నేను, స్నేహానికి స్నేహం నేను, పదునెక్కిన శ్రీశ్రీ కవితను నేను, ఛక్రి ని నేను....... ఫ్రెండ్స్ నన్ను చక్రిగాడంటారు.ప్రస్తుతానికో బ్రమ్మి గాణ్ణి అదేనండి సోఫ్ట్ వేర్ ఇంజనీరు.నాకు కొంచెం కళా పోషణ ఎక్కువని మా దిలీప్ గాడంటుంటాడు.అంటే కొంచెం కవితల్లాంటివి రాస్తుంటాలెండి.కాని వినేవాళ్ళే లేరు:( .ఉన్న ఒక్క దిలీప్ గాడు పరాయి దేశం లో ఉన్నాడు.వాడికి ఫోన్ లో వింపించేంత స్థోమత లేక ఈ బ్లాగ్ క్రియేట్ చేశా.ఇంకా నా గురించి కావలంటే చదువుకోండి
Categories
- చక్రి గాడి తవికలు (4)
Blog Archive
Total hits
4:11 PM
Labels: చక్రి గాడి తవికలు
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment