నా జీవితం లో ఇప్పటిదాక మర్చిపోలేని(మర్చిపోవాలనుకునే) క్షణాలు రెండు....
ఒకటి 10 జూలై 2006 రాత్రి అటు ఇటుగా 8 గంటలు..
రెండోది తేది సరిగ్గా గుర్తులేదు సారీ....
మొదట చెప్పింది నా మొదటి ఉద్యోగం ఆఫర్ తీసుకున్న మొమెంట్ గురించి... ఇంజనీరింగ్ అవ్వగానే ఏ బెంగుళూరు కో హైదరాబాద్ కో వచ్చేసి అర్జంటుగా ఒక సాఫ్ట్ వేర్ జాబ్ లో దూరిపోయి లక్షలు సంపాదించేయాలని కలలు కనే చలా మంది కుర్రాళ్ళలో నేనూ ఒకణ్ణి.కాని ముందు చెప్పిన ఆ మొదటి మొమెంట్ దాక.... ఆఫర్ తీసుకున్న మరుసటి రోజు నాకు జాబొచ్చిందోచ్ అంటు ఆర్కుట్ లొనూ యాహూ మెస్సెంజర్ లోనూ మెస్సేజ్ లు పెట్టేసి అడపా దడపా కాల్స్ చేసేసి అడిగిన వాళ్ళకి లేదనకుండా పార్టీలిచ్చేసి కాలేజ్ లో అందరికన్నా ముందు జాబ్ కొట్టేసాడ్రా చక్రి గాడు అని ముఖం పై నవ్వు బలవంతంగా పులుముకుని మరీ పొగిడే ఫ్రెండ్స్ దగ్గర కొంచెం బడాయి పోయేవాణ్ణి.ఉద్యోగం లో చేరిన మొదటి రోజు..నా కలలకు రెక్కలొచి భవిష్యత్ లోకి ఎగిరిపొతున్నాయి....సన్ లైట్ లో అందంగా మెరిసిపోతూ పోష్ గా ఉండే మా కంపెనీ,అంతకన్నా పోష్ గా అందులోని అమ్మాయిలు....నా జీవితం ధన్యమైందని మా వెంకిని తల్చుకుని లోపలికెళ్ళిన నాకు ఆ రోజిక నిద్రపట్టలేదు.కాని పాపం చక్రి గాడికి(నేనే లెండి) సంవత్సరం పట్టింది సాఫ్ట్ వేర్ బతుకులెలా ఉంటాయో...."సాఫ్ట్ వేర్ ఇంజనీరా వాడికేంటి చేతి నిండా డబ్బులే" అని అనుకునే పక్కింటి ఆంటీలకి,వేలు విడిచిన మావయ్యలకి ఇంక చాలా మంది అమాయకులకి ఒకటే చెప్పగలను.....చెడు వినకు,చెడు మాట్లాడకు అని.ఇంకొ ఏడాది దాటాక మొదలైంది మద్దెలదరువు అన్నట్టు చేరి రెండేళ్ళైనా ఇంకా మూడు లకారాలైనా దాటని జీతం వెక్కిరిస్తుంటే సరిపొదన్నట్టు ఇంకా పనవ్వలేదని మేనేజర్ గాడొకపక్క,మనకన్నా ఎక్కువ సంపాదించే మన ముందు పొగిడిన ఫ్రెండ్సో లేక పక్కింటి పాపాయమ్మ గారి కొడుకొకపక్క.................ఛీ నా బతుకెందుకు అనుకుంటూ.....ఇంకా జాబ్ రాని పఠాన్ గాన్ని చూసి కొంచెం ఇగో శాటిస్ ఫై చేసుకుని లైట్ తీస్కోరా చక్రి గా అనుకుంటూ ఈసారి మంచి హైక్ వస్తే నీకు 10% ఇస్తా అని మనసులో వెంకి ని తల్చుకుంటూ......... అలా కాలం గడిపేస్తున్నా

ఇక రెండోది నా బాలికా స్నెహితురాలు అదేనండి నా గర్ల్ ఫ్రెండ్ నాకు ప్రపోస్ చేసిన మొమెంట్(ఈడికి గర్ల్ ఫ్రెండ్ ఎంటనుకుంటున్నరా... అంతా హైటెక్ మాయ). మా కంపెనీ లో చేరిన కొత్తలో నాకు పరిచయమైన మొదటి అమ్మాయి... చూడగానె మతిపోయే అందం....ఇంకా ట్రైనింగ్ లో మన పక్క సీట్ కావటం తో కొంచెం క్లోస్ గా మూవ్ అయ్యేది.....ఇంకా చెప్పాలంటే తనే నా ఫస్ట్ క్రష్ ....అఫ్ కోర్స్ మన కధలొ హీరోయిన్ ఈమె కాదులెండి.అలా ఒక సంవత్సరం గడిచాక ఒక రొజు చెతిలో వెడ్డింగ్ కార్డ్ పెట్టి------(ఇక అర్థమైపొయుంటుంది గా).తర్వతేమైందనడక్కండి షరా మామూలే.....శంకర్ దాదా సినిమా లో చిరంజీవిలా ఓ మాయా ఓ మాయా అని పాడుకుంటూ తిరిగేవాణ్ణి..మన హీరోయిన్ తో పరిచయమయ్యేదాకా.....ఇంకేముంది మళ్ళీ ఇంకో స్టొరీ స్టార్ట్ ...మా కంపెనీలో అమ్మయే.....మొదట్లో కొట్టుకునే వాళ్ళం..తిట్టుకునే వాళ్ళం .......పరిచయం పెరిగే కొద్దీ...దూరం దగ్గరైంది. కానీ ఈ సారి రెండేళ్ళు పట్టింది ప్రతి దూరం దగ్గరకాలేవని తెలియటానికి... దాంతో దగ్గర దూరం కావటం మొదలైంది........ కొన్ని రొజులకి మళ్ళీ సీన్ రిపీట్ మళ్ళీ చేతిలో కార్డ్ ....మళ్ళీ సేం ఓల్డ్ సాంగ్ "ఓ మాయా ఓ మాయా....."
చక్రి గా నీకెందుకు రా అమ్మాయిలు అని ఇక ఫిక్స్ అయిపోయి ఇలా సాధు జీవితం గడిపేస్తున్నా

ఇదీ ఓ స్వగతమేనా అని పెదవి విరవకండి.....ఎంతైనా నా మొదటి తెలుగు టపా

4 comments:
nani superb ra... are nuvvu okkasaari hyderabad ra ra....... have a talent to became lyrics writer re.... we will try once.... pse
annayya super rasavu.. kevvu kekaa :)
hey chakri chala baga rasav...its simply superb....mothaniki chala kashtalu padinattunnav job loo join ayyaka..:-).anyways i njoyed reading ur blog...keep posting...
yara, cinima hall vishayam dhachavanti, nu chapthava nanu chapanna.....
good screenplay machha,
ni talent naku thalusu ra bacha na ku nuvvu parichayamaina roju nunchi chapputunai vuuna time waste chayaku na mata vinu, na kadhalu kadhanani chyarchi, mana kadhalanu kanchi kakunda yudhaya kovalalnnu nipudham, ni talent ki padhunu pettu.
Post a Comment